Janhvi Kapoor : స్టాండప్ కమెడియన్ గా జాన్వీ కమెడియన్

Janhvi Kapoor : స్టాండప్ కమెడియన్ గా జాన్వీ  కమెడియన్

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్ లోనూ ఇటు సౌత్ లోనూ స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేస్తోంది. టాలీవుడ్లో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు నటిస్తోంది. దాంతోపాటు తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తె రకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'కర్ణ' లో నటిస్తోందని వార్తలొస్తున్నాయి. మరో టాలీవుడ్ సినిమాలోనూ ఈ బ్యూటీకి అవకాశం వచ్చినట్లు కొద్ది రోజుల క్రితం కథనాలు వెలువడ్డా యి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతన్న సినిమాలో జాన్వీకి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు.

ఇదే సమయంలో తనలోని మరో టాలెంట్ ను ప్రేక్షకులకు జాన్వీ పరిచయం చేసేందుకు రెడీ అయింది. కొత్తగా స్టాండప్ కమెడియన్ గానూ ట్రై చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమో వైరల్ అవుతుంది. లీప్ లాఫ్ & లెర్న్ అంటూ ఓ వీడియో రిలీజ్ కాగా.. ఇందులో స్టాండప్ కమెడియన్ గా జాన్వీ నవ్వించే ప్రయత్నం చేసింది. ఇండ స్త్రీలో హీరోయిన్ దూసుకెళ్తున్న జాన్వీ కపూర్.. మరి స్టాండప్ కమెడియన్ రాణిస్తుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story