Jr NTR : జూ.ఎన్టీఆర్ కోపం.. ముంబైలో ఫొటోగ్రాఫర్లపై ఫైరయ్యారా..

Jr NTR : జూ.ఎన్టీఆర్ కోపం.. ముంబైలో ఫొటోగ్రాఫర్లపై ఫైరయ్యారా..

తెలుగు తెర దేవర జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా అంటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. అలాంటది ఆయన బాలీవుడ్ మోస్ట్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలో నటిస్తున్నాడంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ ఓ పక్క కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో వార్ 2 సినిమాకు సైన్ చేశాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో ఎన్.టి.ఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ముంబై హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాడు.

లేటెస్ట్ గా ముంబైలో ఒక హోటల్ లో బస చేసేందుకు వెళ్తున్న ఎన్.టి.ఆర్ ను ఫాలో అవుతూ ఫోటో గ్రాఫర్స్ ఫోటోలు, వీడియోలు తీయబోయారు. అది గమనించిన ఎన్టీఆర్ ఓయ్ అంటూ కసురుకున్నాడు. వైట్ షర్ట్ షార్ట్ హెయిర్, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్. ఫోటోలు తీస్తున్నారని గమనించి ఓయ్ అని అరిచాడు.

ఇలా ఎన్టీఆర్ అరిచిన సందర్భాలు చాలా తక్కువ. సినిమాలో లుక్ రివీల్ అవ్వకూడదనే ఉద్దేశమా లేక తారక్ ఏదైనా ఆలోచనలో ఉండి అలా అరిచాడా అన్నది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story