ప్రజలు ఇడియట్స్ కాదు: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కామెంట్స్

ప్రజలు ఇడియట్స్ కాదు: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కామెంట్స్
భారతీయ చలనచిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన మనసులో ఏది అనిపిస్తే అది పైకి చెప్పేస్తాడు.

భారతీయ చలనచిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తన మనసులో ఏది అనిపిస్తే అది పైకి చెప్పేస్తాడు. దాని గురించి ఎవరేం అనుకున్నా తనకి అనవసరం అన్న ధోరణిలో ఉంటాడు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఆదిపురుష్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

'ఆక్షేపణీయమైన' డైలాగ్‌లు, చవకబారు VFX ఉపయోగించి రామాయణ ఇతిహాసాన్ని తప్పుగా చిత్రీకరించినందుకు చాలా మంది ఈ చిత్రంపై విరుచుకుపడ్డారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరారు. ముందుగా చిత్రనిర్మాతలను తప్పుబట్టారు. అయితే వివేక్ మాత్రం సినిమాలో రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మాట్లాడుతూ, చిత్రనిర్మాతలకు మతపరమైన కథలపై సరైన విశ్వాసం, నమ్మకం లేదు. ఇక దాని లోతును అర్థం చేసుకోగల సామర్థ్యం నటుడికి కూడా లేని కారణంగా చిత్రం విఫలమైంది. ఇలాంటి సినిమా తీయడానికి ముందు కథలోని సున్నితమైన అంశాలను పరిశోధించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు అగ్నిహోత్రి.

మీరు కథలను ఎంచుకున్నప్పుడు మీరే 100% నమ్మకం కలిగి ఉండాలి. లేదా చరిత్ర మీద బాగా ప్రావీణ్యం కలిగి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు, భారతదేశంలో ఎవరూ అలా చేయరు.నిజజీవితంలో చేసే చర్యలు సక్రమంగా లేకుంటే దేవుడి పాత్రలో నటించేందుకు ఆయా నటులను ప్రజలు ఆమోదించరు. నేను దేవుడిని, నన్ను నమ్మండి అంటే ఎవరూ దాన్ని నమ్మరు. ప్రజలు మూర్ఖులు కాదు,” అని ఆయన అన్నారు.

అగ్నిహోత్రి ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నారు. అతని కొత్త వెబ్ సిరీస్ ది కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్. ఇది 1990లో జమ్మూ కాశ్మీర్‌లోని కాశ్మీరీ పండిట్ల వలసల నుండి నిజ జీవితంలో బయటపడిన వారి కథను చూపుతుంది. మరో చిత్రం కోవిడ్-19 వ్యాక్సిన్‌తో వేగంగా ముందుకు వచ్చిన శాస్త్రవేత్తల ఆధారంగా రూపొందించబడిన ది వ్యాక్సిన్ వార్ చిత్రం. ఈ రెండు ప్రాజెక్టులతో అగ్నిహోత్రి ప్రస్తుతం బిజీగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story