బేబమ్మ భలే సమాధానం చెప్పిందిగా..

బేబమ్మ భలే సమాధానం చెప్పిందిగా..
ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా ఆ కథలో పస లేకపోతే నిర్మొహమాటంగా తిప్పికొడతారు ప్రేక్షకులు.

ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా ఆ కథలో పస లేకపోతే నిర్మొహమాటంగా తిప్పికొడతారు ప్రేక్షకులు.. ఈ మధ్య చాలా సినిమాల పరిస్థితి అలానే ఉంది.. సినిమా సక్సెస్ మొదటి ఆటతోనే తెలిసిపోతుంది. నాగజైతన్య, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం కస్టడీ.. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌లో భాగంగా సినిమా టీమ్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. అక్కడ కృతిని ఓ రిపోర్ట్ తాను ఓ ప్రశ్న వేసి ఇరికించాలనుకున్నాడు.. కానీ తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చి ఔరా అనిపించింది బేబమ్మ.

ఉప్పెన తరువాత అవకాశాలు బాగానే అందిపుచ్చుకున్నారు.. అనుకున్నంత సక్సెస్ కాలేదు.. చైతన్యతో నటించిన బంగార్రాజు హిట్ కొట్టింది. మళ్లీ చైతన్యే మీకు మరో హిట్ ఇవ్వాలేమో అని అన్నాడు.. దానికి కృతి ఏ మాత్రం తడుముకోకుండా చైతన్య వైపు తిరిగి.. మీరు నాకు సక్సెస్ ఇచ్చారా అని అడిగేసింది.. దానికి చైతన్య లేదు.. నీ హార్డ్ వర్కే నీకు సక్సెస్ ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు.

అప్పుడు కృతి సక్సెస్ గురించి మాట్లాడుతూ.. ఇది ఏ ఒక్కరి మీదో ఆధారపడి ఉండదు.. నిజమే.. నాగార్జున, చైతన్య ఉండడం వలనే ఆ సినిమా సక్సెస్ అయింది.. అయితే అదే సమయంలో కధ కూడా అంతే ముఖ్యం. ప్రేక్షకులు ఆ సినిమాని ఎంజాయ్ చేశారు.. అదీకాక సంక్రాంతికి రిలీజ్ అయింది.. సరైన కథ, సరైన సమయంలో రిలీజ్ ఇవి ఓ సినిమా సక్సెస్‌ని నిర్ణయిస్తాయి. అంతేకానీ హీరో లేక హీరోయిన్ కాదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. బేబమ్మ సమాధానానికి రిపోర్టర్ నోట మాట రాలేదు.. సూపర్‌గా చెప్పావు బేబమ్మా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story