Mahesh and Rajamouli : వావ్.. మహేశ్, రాజమౌళి షూటింగ్ మొదలయ్యేదా ఆ రోజే..!

Mahesh and Rajamouli : వావ్.. మహేశ్, రాజమౌళి షూటింగ్ మొదలయ్యేదా ఆ రోజే..!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతూ ఎగిరిగంతేసే వార్తే ఇది. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమా షూట్ అప్ డేట్స్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ ఇది. మరో ఆరు నెలలు టైం పడుతుందని ప్రచారం జరుగుతున్న టైంలో అసలు విషయం ఒకటి వైరల్ అవుతోంది.

మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో మూవీ ప్రిప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. మూవీ షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించడానికి ఓ మంచి ముహూర్తం ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే.. మహేశ్ బాబు రాజమౌళి కోరినట్టుగా పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. దీంతో.. ఈ సినిమాను మే 31న మహేష్ బాబు తండ్రి దివంగత స్టార్ హీరో, కృష్ణ పుట్టినరోజు సందర్భంగా లాంచింగ్ ఈవెంట్ ను ప్రారంభించబోతున్నారట. ముహూర్తపు షాట్ ను అదే రోజు తీస్తారని టాక్.

అప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా అయిపోతాయి. జస్ట్ 4 రోజుల్లో రిజల్ట్స్ ఉంటాయి అంతే. కాబట్టి.. కృష్ణ జయంతి రోజున మహేశ్ ఫ్యాన్స్ అందరికీ ఓ ల్యాండ్ మార్క్ అచీవ్ మెంట్ గా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేశారని చెబుతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కే ఎల్ నారాయణ బ్యానర్ లో త్వరలోనే ఓ అఫీషియల్ అప్ డేట్ వస్తుందని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story