IPL 2024 : చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్

IPL 2024 : చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్

లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 3 సార్లు 155 కి.మీ. ఎక్కువ వేగంతో బంతులు వేసి, రికార్డులకెక్కారు. మయాంక్ కేవలం 2 మ్యాచుల్లో 50 కంటే తక్కువ బంతులే వేసి ఈ ఫీట్ సాధించారు. ఉమ్రాన్ మాలిక్, నోర్ట్జే 2 సార్లు ఈ రికార్డు అందుకున్నారు. కాగా, ఐపీఎల్ హిస్టరీలో షాన్ టెయిట్ వేసిన 157.7 కి.మీ. బాల్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేదు.

మయాంక్ యాదవ్ మరో అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లో POTM అవార్డు అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన మయాంక్ 150KMPH పైగా బంతులు విసురుతూ సెన్సేషన్‌గా మారారు. పంజాబ్‌, ఆర్సీబీతో మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశారు.

లక్నో బౌలర్ మయాంక్ ప్రభు యాదవ్ ఢిల్లీలో జన్మించారు. రంజీ ట్రోఫీ 2022లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత లిస్ట్-ఏ, టీ20 క్రికెట్‌లో సత్తా చాటడంతో 2022 మెగా వేలంలో లక్నో అతన్ని రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అతనికి ఒక్క అవకాశమూ రాకపోగా గాయంతో గత ఐపీఎల్‌కు దూరమయ్యారు. అతడిపై నమ్మకంతో లక్నో అతన్ని వదులుకోలేదు. ఈ సీజన్‌లో దాన్ని మయాంక్ ఒడిసి పట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story