Meenakshi Chaudary : మీనాక్షి చౌదరి.. ఏం లక్కురా బాబూ..!

Meenakshi Chaudary : మీనాక్షి చౌదరి.. ఏం లక్కురా బాబూ..!

కళ్లు చెదిరే నవ్వు.. కిర్రెక్కించే ఫిగర్ మీనాక్షి చౌదరి సొంతం. ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే చాలామంది యూత్ గుండెల్లో తన ఫొటో ప్రింట్ వేసేసింది ఈ భామ. కరెక్ట్ సినిమా పడితే ఈ ఫిగర్ ప్యాన్ ఇండియా బ్యూటీ అవుతుందనే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. సాలిడ్ ఫిగర్ అయినప్పటికీ కరెక్ట్ గా వాడలేదన్న విమర్శలు ఉన్నప్పటికీ.. అవతల మహేశ్ బాబు ఉన్నాడు కాబట్టి కనిపిస్తే చాలన్న ఒపీనియన్స్ కూడా వచ్చాయి.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్లింది. మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మెప్పించిన మీనాక్షి చౌదరి.. కనిపించింది చిన్న క్యారెక్టర్ లోనే ఆయినా.. తన నటనతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. మీనాక్షి చౌదరి సౌత్ లో స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకునేలా ఉంది. ఓ పక్కన తమిళ్ స్టార్ హీరో విజయ్‌తో గోట్‌ సినిమాలో నటిస్తూనే.. నెక్స్ట్‌ వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక విశ్వక్ సేన్ తోను ఓ సినిమాకు ఓకే చేసింది ఈ ముద్దుగుమ్మ. మరో భారీ ప్రాజెక్టుకు మీనాక్షి సైన్ చేసిందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని.. ప్రస్తుతం ఇతర నటీనటులు టెక్నికల్ స్టాఫ్ కోసం సెలక్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీ స్క్రిప్ట్‌ని అనిల్ రావిపూడి ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఈ సినిమా టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందంతో ఓవైపు యంగ్ హీరోస్ పక్కన అవకాశాలు అందుకుంటూనే.. మరో పక్క సీనియర్ హీరోలతో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిన మీనాక్షి చౌదరి.. ఫిలిం ఇండస్ట్రీలో హాట్ సరుకుగా మారిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story