Mrunal Thakur : బ్రేక్ టైం కూడా ముఖ్యమే అంటున్న మృణాల్
సీతారామం సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటోంది. సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ చేసిన సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ హిట్ తో తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుందీ అమ్మడు. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.
ఇటు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ అటు బాలీవుడ్ లో కూడా రాణిస్తుంది. కెరీర్ లో సూపర్ ఫాం కొనసాగిస్తున్న అమ్మడు బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు బిజీ బిజీ టైం లో సరదాగా తీసుకునే విరామాలు క్రియేటివిటీని పెంచుతాయని చెప్పింది. లాస్ట్ ఇయర్ ఆరు సినిమాల్లో నటించిన మృణాల్ ఈ ఇయర్ కూడా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమైంది.
ఇక రీసెంట్ గా ఇంటర్వ్యూలో నటీనటులకు కొంత బ్రేక్ టైం కూడా ముఖ్యమని అంటోంది. బిజీ బిజీగా కాలంతో పాటు పరుగెడుతున్న ఈ సినీ ప్రయాణంలో యాక్టర్స్ కొంత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. వారితో కలిసి ప్రయాణాలు చేయడం ఎంతో ఇంపార్టెంట్ అంటోంది మృణాల్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com