Daring Tweet : నిఖిల్ డేరింగ్ ట్వీట్.. కేంద్రమంత్రినే ట్యాగ్ చేస్తూ పోస్ట్

Daring Tweet : నిఖిల్ డేరింగ్ ట్వీట్.. కేంద్రమంత్రినే ట్యాగ్ చేస్తూ పోస్ట్

హ్యాపీడేస్ నిఖిల్ (Nikhil) ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కార్తికేయ సీక్వెల్ తో బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసేవన్నీ ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న సినిమాలే. నిఖిల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన స్టార్ స్టేటస్ ను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో అహర్నిశలు శ్రమిస్తున్నాడు.

తాజాగా నిఖిల్ దేశం మొత్తం చర్చనీయాంశంగా మారే విధంగా హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సాకర్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లు ఇటీవలే జోరుగా సాగాయి. టీమిండియా ప్రదర్శన ఊహించిన విధంగా లేకపోవడం ఫుట్‌బాల్ క్రీడల్లో ఇండియా వెనుకబడి ఉండడంపై నిఖిల్ నిరాశ చెందాడు. క్వాలిఫయర్ మ్యాచ్లో టీమిండియా ఓటమి.. హీరో నిఖిల్‌ను బాగా హార్ట్ చేసింది. ఏకంగా ఫుట్‌బాల్ ఎసోసియేషన్‌కి, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను ట్యాగ్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశాడు.

"ఇప్పుడే టీమిండియా క్వాలిఫైయర్ మ్యాచ్ చూశా. చాలా డిసప్పాయింట్ అయ్యా. ఇండియన్ ఫుట్‌బాల్‌ అసోసియేషన్ సిగ్గుపడాల్సిన విషయం ఇది. ప్రపంచంలోనే అత్యధిక జనాలు ఉన్న మన దేశంలో ఇంతకంటే మంచి ప్రదర్శన ఇవ్వచ్చు. ఇండియాలో స్పోర్ట్స్ డిపార్టుమెంట్ ను ప్రక్షాళన చేయాలి" అంటూ నిఖిల్ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ను ట్యాగ్ చేస్తూ కోరాడు. నిఖిల్ ట్విట్ పై నెటిజెన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. నిఖిల్ వాదనలోనూ నిజం ఉందని.. ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story