Keerthy Suresh : పెళ్లయినా తగ్గేదేలే!.. . హీరోయిన్ గా నటిస్తా : కీర్తి సురేశ్

Keerthy Suresh : పెళ్లయినా తగ్గేదేలే!.. . హీరోయిన్ గా నటిస్తా :  కీర్తి సురేశ్

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకో గానే సినిమాల్లో నటనకు ఫుల్ స్టాప్ పెట్టే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయినా తగ్గేదేలే అంటున్నారు. కాజల్ ఆగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ సినిమా సత్యభామతో తన సత్తా చాటనుంది. గ్లామర్ రోల్స్ కి కూడా రెడీ అవుతోంది కాజల్. కీర్తి సురేశ్ కూడా పెళ్లి తర్వాత తగ్గేదేలే అంటోంది. హీరోయిన్ గా నటిస్తానని అంటోంది. పెళ్లికి.. సినిమాలకి సంబంధం లేదంటోంది. ముందే భర్త దగ్గర.. అతని కుటుంబ సభ్యల వద్ద అనుమతి తీసేసుకుందట. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లికాని భామ లకంటే పెళ్లై న వారికే మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉందంటున్నారు.

మెగా కోడలిగా అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠీ కూడా వివాహం తర్వాత ఎలాంటి అడ్డంకులు లేవని సినిమాలు కొనసాగిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ కూడా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు అన్ని పూర్తిచేసిన తర్వాత పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీర్తి కెరీర్ పీక్స్ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తుంది. అందులోనూ తమిళ్ లో చాలా బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే బాలీవుడ్ లోనూ లాంచ్ అవుతుంది. 'బేబీజాన్' అనే ఓసినిమా చేస్తుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా సైన్ చేసింది. గ్లామర్ విషయంలో కూడా ఎలాంటి కండీషన్లు పెట్టుకోకుండా పనిచేస్తోంది.

గతంలా ఉంటే పనిజరగదని భావించిన అమ్మడిప్పుడు అప్డేట్ అయి పని చేస్తుంది. కీర్తి తల్లి నటి మేనక అన్న సంగతి తెలిసిందే. మేనక కూడా వివాహం తర్వాత చాలా కాలం పాటు సినిమాల్లో నటించారు. మూడేళ్ల క్రితం వరకూ కూడా ఆమె యాక్టివ్ గా నే ఉన్నారు. కాబట్టి తల్లివైపు నుంచి పూర్తి మద్దతు కీర్తికి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కీర్తి సురేశ్ కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. ఓ హిందీ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇందులో అమ్మడు ఏకంగా ప్రియమ ణితోనే పోటీ పడి నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story