Devara : ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య ఈమెనే

Devara : ‘దేవర’లో ఎన్టీఆర్ భార్య ఈమెనే

దేవర (Devara) సినిమాలో తాను నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే స్వయంగా ప్రకటించారు. ‘దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రుతి. ఇప్పటికే ఈ మూవీలో జాన్వీ కపూర్ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుండగా, శ్రుతి రెండో హీరోయిన్. ఎన్టీఆర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తారని టాక్.

కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇక శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ వంటి స్టార్ కాస్ట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ పై ఓ సాంగ్ ని రూపొందిస్తున్నారు.

గుజరాత్‌కు చెందిన శ్రుతి మరాఠే గతేడాదిలో పూణేలో జరిగిన గణపతి నిమజ్జనం సమయంలో కొన్ని గంటల పాటు ఆమె డోలు వాయించింది. అప్పట్లో ఆమె వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి

Tags

Read MoreRead Less
Next Story