Shaitaan : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సైతాన్!

Shaitaan : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సైతాన్!

అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం సైతాన్. గత నెల 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ మే 3న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.

ఈ మూవీకి అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. సైతాన్ చిత్రానికి సుమారు రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.208.4 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‍గా నిలిచింది. 8 వారాలకి ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం ఈ సినిమా కోసం మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు సైతాన్ సినిమా ఓటిటిలో ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story