Pooja Hegde : సొంత ఇండస్ట్రీలో పూజా ఫస్ట్ మూవీ

Pooja Hegde : సొంత ఇండస్ట్రీలో పూజా ఫస్ట్ మూవీ

మోడల్ గా రాణించి అనంతరం సినిమా ఇండస్త్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీ పూజా హెగ్దే. టాలీవుడ్ లోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అల వైకుంఠపురంలో నటించి టాలీవుడ్ బుట్ట బొమ్మగా మారిపోయింది. కొంత కాలం క్రితం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కాస్త డీలా పడింది.

రాధేశ్యామ్ ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ అమ్మ డికి అవకాశాలు తగ్గాయి. మహేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా ఈ బ్యూటీకి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ, రవితేజ్ సినిమా మిస్టర్ బచ్చన్ కోసం పూజా హెగ్దే ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ తరువాత ఈ సినిమాల్లో వేరే హీరోయిన్లు ఎంపిక య్యారు. ఇలాంటి సమయంలో ఈ బ్యూటీకి సొంత ఇండస్ట్రీలో ఓ చాన్స్ వచ్చింది. కన్నడలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో పూజాహెగ్దే నటించేందుకు ఒప్పు కుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. పూజా హెగ్దే ఈ సినిమా చేస్తే కన్నడలో ఆమెకు మొదటి సినిమా అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story