Pooja Hedge : గ్లామర్ డోస్ పెంచనున్న బుట్టబొమ్మ

Pooja Hedge : గ్లామర్ డోస్ పెంచనున్న బుట్టబొమ్మ

మొన్నటి వరకు సౌత్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన పూజా హెగ్దే.. ప్రస్తుతం తగిన ఆఫర్లు లేక కాస్త డీలా పడింది. ఆమె క్రేజ్ కూడా తగ్గడంతో ఈ బుట్టబొమ్మను మేకర్స్ పక్కన పెట్టారు. ఇలాంటి టైంలోనే ఉన్నట్టుండి ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి చాన్స్ లు వచ్చాయి. లాస్ట్ ఇయర్ సల్మాన్ తో కిసి కా భాయ్ కిసి కి జాన్ సినిమాలో పూజా నటించింది.

ఆ సినిమా ఆశించినంతగా రాణించకపోవడంతో అక్కడి నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ రావట్లేదు. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో దేవా సినిమాలో పూజాహెగ్దే నటిస్తోంది. అయితే వచ్చిన ఈ ఒక్క ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడుకునేందుకు బుట్ట బొమ్మ సిద్ధమైందట. దేవా లో గ్లామర్ ట్రీట్ లో నెక్స్ లెవెల్ డోస్ పెంచేస్తుందట. షాహిద్ తో లిప్ లాక్ కూడా ఉంటుందని టాక్. పూజా గ్లామర్ డోస్ ఈ సినిమాకే హైలెట్ గా నిలువనుందట. ఇక సినిమాను దసరాకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీలో పూజా హెగ్డే ఓ ఐటెమ్ సాంగ్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ మేకర్స్ సంప్రదించగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించి చివరకు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.కాగా పూజా రంగస్థలం సినిమాలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ చేశారు. ఈ పాటతో పూజా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story