Devil : ఓటీటీలోకి పూర్ణ హారర్ మూవీ

Devil : ఓటీటీలోకి పూర్ణ హారర్ మూవీ

హీరోయిన్ పూర్ణ (Purna) నటించిన హారర్ మూవీ డెవిల్. పూర్ణతో పాటు టాలీవుడ్ హీరో త్రిగుణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. విదార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ.. ఆథియా దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది. డెవిల్ లో గృహిణిగా పూర్ణ యాక్ట్ చేసింది. ఆమె భర్త అలెక్స్ ఓ ఫేమస్ లాయర్. తన ఆఫీస్ లోనే పనిచేసే సోఫియా అనే అమ్మాయితో రిలేషన్ షిప్ కొనసాగిస్తుంటాడు.

యాక్సిడెంట్ ద్వారా హేమ జీవితంలోకి రోషన్ వస్తాడు. రోషన్, హేమల బంధం గురించి తెలిసి అలెక్స్ ఏం చేశాడు.. అన్నదే డెవిల్ మూవీ కథ. డెవిల్ లో పూర్ణ నటన బాగున్నా.. స్టోరీ రొటీన్ గానే ఉండటంతో కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. థియేటర్లలో కోటి లోపే వసూళ్లను రాబట్టింది. దాదాపు రెండేళ్ల తర్వాత డెవిల్ సినిమాతో పూర్ణ కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇక ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. మార్చి 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అల్లరి నరేష్ సీమటపాకాయ్ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. అనంతరం అవును, లడ్డుబాబు, రాజుగారి గదితో పాటు చాలా సినిమాలు చేసింది. అఖండ, దృశ్యం 2, దసరాతో పాటు పలు బ్లాక్బస్టర్ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. రీసెంట్ గా రిలీజైన మహేష్ బాబు గుంటూరు కారంలోనూ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.

Tags

Read MoreRead Less
Next Story