Priyanka Chopra : ప్రియాంక నెక్లెస్@ 58.65 లక్షలు

Priyanka Chopra : ప్రియాంక నెక్లెస్@ 58.65 లక్షలు

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు (Priyanka Chopra) ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు.. అనంతరం గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. మొదట్లో హిందీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హాలీవుడ్ చిత్రా ల్లోనూ తన సత్తాను చాటుతోంది. విజయ్ హీరోగా నటించిన 'తమిళన్' చిత్రంతో ఇండస్ట్రీలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. అనంతరం సన్నిడియోల్ హీరోగా నటంచిన 'ది హీరో.. లవ్ స్టోరీ ఆఫ్ స్పై' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత వెనుదిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ను ఈ బ్యూటీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం హాలీవుడ్కు షిఫ్ట్ అయ్యింది. ది స్కై ఈజ్ పింక్, లవ్ ఎగైన్, వీ కెన్ బీ హీరోస్తో పాటు హాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో హెడ్స్ ఆఫ్ స్టేట్ మూవీ చేస్తోంది.

ఈ సినిమాలో గోల్డెన్ గ్లోబ్ విన్నర్ ఇద్రీస్ ఎల్బా తో పాటు డబ్ల్యూ డబ్ల్యూ ఈ స్టార్ జాన్ సెనా హీరోలుగా నటిస్తున్నారు. అయితే నిన్న ప్రియాంక దంపతులు ఇండియాకు వచ్చారు. ఇవాళ ముంబైలోని ఓ కార్య క్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రియాంక రూ. 58.65 లక్షల నెక్లెస్ ను ధరించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story