Special Song : ధనుశ్ మూవీలో ప్రియాంక స్పెషల్ సాంగ్

Special Song : ధనుశ్ మూవీలో  ప్రియాంక స్పెషల్ సాంగ్

తమిళ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) ఓ పక్క హీరోగా రాణిస్తూనే మరో పక్క దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఈయన 50వ సినిమా రాయన్ కు ధనుశే స్వీయ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సైతం పూర్తి చేసుకుంది. దీంతో తన 51వ చిత్రం కుబేరపై ధనుశ్ దృష్టి సారించాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ధనుశ్ మరో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆయన సోదరి కొడుకు పవిశ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. 'ఎన్మోల్ ఎన్నడీ కోబం' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్, ప్రియ ప్రకాశ్ వారియర్, రమ్య రంగనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధనుశ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్నాడు.

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ పాటలో ప్రియాంక మోహన్ నటించినట్లు సమాచారం. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఎన్మోల్ ఎన్నడీ కోబం కు ఈ పాటనే కీలకమని టాక్. ఇక ప్రియాంకా అరుళ్‌ మోహన్, నాని గ్యాంగ్ లీడర్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. శ్రీకారం అనే సినిమాలో కూడా నటించింది. మహేష్ బాబు హీరోగా, అనీల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించనుంది.

Tags

Read MoreRead Less
Next Story