Pushpa 2 : పుష్ప 2.. టీజర్ రేపిన బాక్సాఫీస్ చిచ్చు

Pushpa 2 : పుష్ప 2.. టీజర్ రేపిన బాక్సాఫీస్ చిచ్చు

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప 2 టీజర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో నార్త్ లో పుష్ప 2 వసూళ్లు కుమ్మేయడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

AA బర్త్ డే స్పెషల్ గా పుష్ప 2 టీజర్ ఏప్రిల్ 8న విడుదల చేశారు. జాతరలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ రౌడీలను ఇరగదీస్తున్నాడు. ఆయన గెటప్, వాకింగ్, మాస్ మేనరిజం కట్టిపడేశాయి. పుష్ప 2 టీజర్ కి నార్త్ మీడియా ఫిదా అయ్యింది. అందరూ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. పుష్ప 2 హిందీ వెర్షన్ మొదటి రోజు రూ.50 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు. అలాగే లాంగ్ రన్ లో రూ.600 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుందని ఎస్టిమేషన్స్ వేస్తున్నాయి బిజినెస్ వర్గాలు.

2021లో విడుదలైన పుష్ప అల్లు అర్జున్ కెరీర్ నే మార్చేసింది. ఆయన్ను ప్యాన్ ఇండియా స్టార్ ను చేసింది. పుష్ప తెలుగులో కంటే హిందీ బెల్ట్ లో దుమ్ములేపింది. ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ కు ఉన్న ఫాలోయింగ్ కంటే బాలీవుడ్ లో అభిమానులు ఎక్కువ. పుష్ప 2 రిలీజైతే.. నార్తిండియాలో సృష్టించే సునామీ ఎలాంటిదో ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story