Mahesh Babu Look : రాజమౌళి రచ్చ అంటే ఇదే..! మహేష్ లుక్ టెస్ట్‌కే 4 వారాలు

Mahesh Babu Look : రాజమౌళి రచ్చ అంటే ఇదే..! మహేష్ లుక్ టెస్ట్‌కే 4 వారాలు

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే లెక్కలు, ఎక్కాలు చాలా ఉంటాయి. ఆయన ఇచ్చే ఔట్ పుట్ అలా ఉంటుంది కాబట్టే వీటన్నింటికీ ఓపిక పడుతుంటారు సినిమా యూనిట్. ప్రీ ప్రొడక్షన్ కోసం రాజమౌళి చాలా సమయం తీసుకొంటారు. షూటింగ్ మాత్రం చక చకా కానిచ్చేస్తారు. అదే ఆయన స్పెషాలిటీ.

మహేష్ బాబు (Mahesh Babu) సినిమా కోసం కూడా అలాంటి కసరత్తే చేస్తున్నారు రాజమౌళి. స్క్రిప్టు విషయంలో అస్సలు రాజీ పడడం లేదు. మరీ ముఖ్యంగా మహేష్ లుక్ కోసమే నెల రోజులు కేటాయించారు. మహేష్ కోసం స్కెచ్ ఆర్టిస్టులతో ఏడెనిమిది రకాల గెటప్పులు రెడీ చేశారు. మహేష్ ఎలా ఉంటాడు? కెమెరా ముందు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోంది? అనే విషయమై రాజమౌళి అండ్ టీమ్ బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది. ఏ లుక్ లో మహేష్ సూట్ అవుతాడో తెలియడానికి లుక్ టెస్ట్ అవసరం.

రాజమౌళి అండ్ టీమ్.. నెల రోజుల పాటు 8 రకాల లుక్స్‌ని పరిశీలించి.. చివరికి ఒకటి ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి అంతర్జాతీయ నిపుణుల్ని రంగంలోకి దించనున్నాడు. ఈ చిత్రాన్ని రాజమౌళి స్టైలిష్ యాక్షన్ ఎడ్వెంచరెస్‌గా తీర్చిదిద్దబోతున్నాడు. ప్యాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మూవీకి 'మహారాజ్‌' అనే పేరు పరిశీలిస్తోందన్న టాక్ నడుస్తోంది. త్వరలోనే రాజమౌళి, మహేశ్ బాబు డీటెయిల్డ్ ప్యాన్ ఇండియా ప్రెస్ మీట్ ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story