సుకుమార్‌తో రామ్ చరణ్ మూవీ.. అప్ కమింగ్ సెన్సేషన్

సుకుమార్‌తో రామ్ చరణ్ మూవీ.. అప్ కమింగ్ సెన్సేషన్

రామ్ చరణ్ (Ram Charan) - శంకర్ - ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). ఈ మూవీ టాలీవుడ్ లో (Tollywood) గేమ్ చేంజర్ అవుతుందన్న టాక్ ఉంది. మరోవైపు.. మరో భారీ సినిమాకు రామ్ చరణ్ సైన్ చేసినట్టు తెలుస్తోంది.

గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సనాతో మరో సినిమాలో నటించినున్నాడు చెర్రీ. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బుచ్చిబాబు తర్వాత రామ్ చరణ్.. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్‌గా మారిపోయిన సుకుమార్ డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడట.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ - చరణ్ సినిమా రూపొందించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఒక రకంగా ఇది మరో రంగస్థలం కాబోతుందని తెలుస్తుంది. గతంలో రామ్ చరణ్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్, దేవిశ్రీప్రసాద్ కాంబోలో రంగస్థలం సినిమా రిలీజై బాహుబలి-1 రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కల్లగొట్టింది. రామ్ చరణ్ మార్కెట్‌ను మరో లెవెల్ కు తీసుకువెళ్ళింది. చెర్రీలో కొత్త కోణాన్ని సుకుమార్ ఈ సినిమాతో చూపించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story