Rashmika : రష్మిక డిసైడ్ .. ఇక ప్రతి ఏడాదీ జపాన్ వెళ్తుందట

Rashmika : రష్మిక డిసైడ్ ..  ఇక ప్రతి ఏడాదీ జపాన్ వెళ్తుందట

జపాన్ లో (Japan) రీసెంట్ గా జరిగిన క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున నేషనల్ క్రష్ రష్మిక పాల్గొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారత్ నుంచి ఈ అరుదైన అవకాశం కేవలం రష్మికకు మాత్రమే దక్కింది. జపాన్ వెళ్లిన రష్మికకు అక్కడి అభిమానుల నుంచి గ్రాండ్ వెల్ క మ్ లభించింది. ఈ బ్యూటీ కోసం ఎయిర్ పోర్టు వెలుపల ప్లకార్డులు పట్టుకుని అభిమానులంతా స్వాగతం పలికారు. దీంతో తానొక గొప్ప అనుభూతికి లోనైనట్లు రష్మిక ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఏడాదికోసారి జపాన్ కు వెళ్లాలని రష్మిక డిసైడ్ అయిందట. ప్రతి ఏడాది ఓ వెకేషన్ లా జపాన్ టూర్ వస్తానని అక్కడి అభిమానులకు ప్రామిస్ చేసిందట. టోక్యో నగరంలో ఎన్నో అందాలు ఉన్నాయని వాటి మొత్తాన్ని చూస్తానని మాట ఇచ్చిందట. ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతంలో నివసిస్తానని చెప్పిందట. కేవలం అభిమానుల కోసమే రష్మిక ఈ నిర్ణయం తీసుకుందట.

ఇక 'పుష్ప'తో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా విడుదలైన 'యానిమల్ ' సినిమాతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ ఈ బ్యూటీ నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story