Rashmika Mandanna : 5 నెలలు దూరంగా ఉన్నా.. ఇక ఉండలేను : రష్మిక

Rashmika Mandanna : 5 నెలలు దూరంగా ఉన్నా.. ఇక ఉండలేను : రష్మిక

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna). రీసెంట్ వచ్చిన యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ నేషనల్ క్రష్. ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు.. పుష్ప 2లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. వీటితో పాటు మరో రెండు పెద్ద సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే రష్మిక.. తాజాగా తాను వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. గత నాలుగైదు నెలలుగా బిజీ షెడ్యూల్ కారణంగా జిమ్ కి దూరంగా ఉన్నానంటూ తెలిపింది. ఇకపై రె గ్యులర్ గా వర్కౌట్స్ చేస్తానంటూ రాసుకొచ్చిం ది. తన డైలీ లైఫ్ లో ఏదో ఒక సమయంలో జిమ్ కి వెళ్తాను అన్నట్లుగా రష్మిక తన పోస్ట్ లో పేర్కొంది.

రష్మిక పోస్ట్ పై ఆమె అభిమా నుల నుంచి తెగ రెస్పాన్స్ వస్తోంది. నాలుగైదు నెలలు రష్మిక వర్కౌట్ చేయకున్నా కూడా ఆమె ఫిజిక్ లో ఏ మార్పు రాలేదని నెటిజన్లు అంటున్నారు. పైగా అందం మరింత పెరి గిందన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story