Rashmika Mandanna : నా భర్త ఇలా ఉండాలంటున్న రష్మిక మందాన

Rashmika Mandanna : నా భర్త ఇలా ఉండాలంటున్న రష్మిక మందాన

Rashmika mandanna : 'పుష్ప' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత కెరీర్ పరంగా కాస్త డీలా పడ్డ నేషనల్ క్రష్ రష్మిక మందన గత ఏడాది డిసెంబర్ లో వ చ్చిన 'యానిమల్ ' తో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ హిట్ అవ్వడంతో రష్మిక ఒక్కసారిగా పుంజుకుంది. యానిమల్ సక్సెస్ తరువాత సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరు స సినిమాలతో దూసుకుపోతుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో టచ్ ఉంటూ వాళ్లతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఈ ముద్దుగుమ్మ తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పేసింది. రష్మిక మందన ఢిల్లీ ఫ్యాన్స్ అనే ఎక్స్ అకౌంట్లో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే డిస్కషన్ నడిచింది. అకౌంట్లో ఫ్యాన్స్ రష్మిక కాబోయే భర్త గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పారు. అతను VD లాగా ఉండాలని ఫ్యాన్స్ చెబితే ఆ పోస్టు కింద రష్మిక అవును నిజమేనని కూడా రిప్లై ఇచ్చింది. ఇంతకీ 'VD అంటే మీరు అనుకుంటున్నట్టు 'విజయ్ దేవరకొండ కాదండోయ్ ! VD అంటే "Very Dading' అని అర్ధం. "రష్మిక ఇండియాకి నేషనల్ క్రష్ కాబట్టి ఆమె కాబోయే భర్త చాలా స్పెషల్ గా అంటే 'VD' లాగా ఉండాలి. అంటే దాని అర్ధం వేరి డేరింగ్ గా ఉంటూ ఆమెను ప్రొటెక్ట్ చేయాలి. ఆమెను మేము క్వీన్ లాగా పిలుచుకుంటాం కాబట్టి ఆమె కాబోయే భర్త కూడా కింగ్ లాగా ఉండాలి" అంటూ ఫ్యాన్స్ పోస్ట్ పెట్టారు.

పోస్ట్ కి రష్మిక రిపై ఇస్తూ ' అవును అది నిజమే అని రాసుకొచ్చింది. ట్విటర్లో ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ తనకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ అని రష్మిక ఇలా హింట్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండను ముద్దుగా VD అని పిలుస్తుంటారు. అయితే ఈ పోస్టులో 'VD' అనే పదానికి ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థం వెతుకుతూ రష్మిక విజయ్ దేవరకొండతో తన రిలేషన్ ని ఇలా పరోక్షంగా కన్ఫర్ చేసిందని... త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story