Sai Pallavi : నేను వద్దన్నా ఆయన వినడు.. సాయి పల్లవి హాట్ కామెంట్

Sai Pallavi : నేను వద్దన్నా ఆయన వినడు.. సాయి పల్లవి హాట్ కామెంట్

మెస్మరైజింగ్ ఆర్టిస్ట్, డ్యాన్సర్ సాయిపల్లవి ఏది మాట్లాడినా వైరల్ అవుతుంటుంది. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఫిదా సినిమాతో ప్రతి ఒక్క ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. స్టార్ హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది ఈ బాన్సువాడ భానుమతి.

పాపులారిటీ విపరీతంగా ఉన్నా కూడా ఈ నేచురల్ బ్యూటీకి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ లో తన ట్యాలెంట్ ప్రూవ చేసుకోవాలనుకుంటోంది సాయిపల్లవి. ఈ క్రమంలోనే తాజాగా తన తండ్రిపై కొన్ని ఆసక్తి గల వ్యాఖ్యలు చేసింది.

"మూవీలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళితే నీరసంగా కనిపించేది. అప్పుడు నాన్న గమనించి నా దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకునేవారు. వద్దన్నా వినేవారు కాదు. బిడ్డ ఇబ్బంది పడొద్దని కాళ్లు మసాజ్ చేసేవారు" అంటూ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రేట్ ఫాదర్.. అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్.

Tags

Read MoreRead Less
Next Story