Sai Pallavi : సాయిపల్లవి... సమ్ థింగ్ స్పెషల్

Sai Pallavi : సాయిపల్లవి...  సమ్ థింగ్ స్పెషల్

గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు వచ్చాక ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ, ఎంపిక చేసుకున్న పాత్రల్లో మాత్రమే నటించడం చాలా తక్కువ. కానీ నటి సాయిపల్లవి మాత్రం అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తుంటే ఆమె మాత్రం నచ్చిన సినిమలే చేస్తాను అని అంటోంది. ఇంకా సింపుల్ లైఫ్ అంటే ఆమెకు మరీ ఇష్టం.

నటిగా, నర్తకిగా పేరున్న సాయి పల్లవి (Sai Pallavi) తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తుంటుంది. క్యారెక్టర్ నచ్చితేనే నటిస్తాను అంటూ కచ్చితంగా చెప్పే సాయి పల్లవి నచ్చక నిరాకరించిన సినిమాలు చాలా ఉన్నాయి. సినిమా పూర్తిచేశాక ఎవరికీ అందుబాటులో లేకుండా పోతుంది. కుటంబ సభ్యులతో గడుపుతుంది. ఫిదాతో తెలుగు వారి మనసు దోచేసిన ఈ భామ ఇప్పుడు తండేల్ అనే సినిమాలో నాగచైతన్య కాంబినేషన్లో నటిస్తోంది.

ఇటీవలే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. సాయి పల్లవి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది స్పష్టమైంది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. బాలీవుడ్లో జునైద్ ఖాన్తో నటించేందుకు అంగీకరిం చినట్టు సమాచారం. అలాగే హిందీలో తెరకెక్కనున్న రామాయణంలో సీతగా నటిస్తుందని చార జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story