Samantha : సమంత హాట్ ఫొటోలు.. స్టార్ హీరోయిన్లు పరేషాన్

Samantha : సమంత హాట్ ఫొటోలు.. స్టార్ హీరోయిన్లు పరేషాన్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సంచలనం రేపుతోంది సమంత (Samantha). ప్రస్తుతం సిటాడెల్‌ వెబ్ సిరీస్ కమిట్ అయింది. తెలుగులో ఇంకా ఎటువంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఆమెను వెండితెరపై ఆమెను చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సమంత ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా ఆమె ఫ్యాషన్ ఐకాన్ గా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో 34 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏ రేంజ్‌లో క్రేజ్ సంపాధించుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. స్యామ్ చేసే ఫోటోషూట్స్ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా స్టన్నింగ్ లుక్‌లో సమంత బ్లాక్ లేజర్ ధరించి ఫోజులు ఇచ్చింది. బ్రా లేకుండా కేవలం బ్లేజర్ తో డిఫరెంట్‌ స్టిల్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఇట్స్ స్టైల్ బేబీ అనే ట్యాగ్‌ను యాడ్ చేసింది.

ఇవి వైరల్ అవ్వడంతో అభిమానులు కాదు.. స్టార్ హీరోయిన్స్ తమన్నా, రోహిణి శర్మ లాంటి వారు కూడా దీనిపై స్పందించారు. తమన్నా, రోహిణి శర్మ ఇద్దరూ ఫైర్ ఇమోజీలతో సమంత ఫొటోస్ పై తమ రియాక్షన్ తెలియజేశారు. ఇలా రియాక్షన్స్ పెట్టడం వల్ల కూడా తమకు ఫాలోవర్లను పెంచుకుంటున్నారు హీరోయిన్లు.

Tags

Read MoreRead Less
Next Story