Samantha Role : పుష్ప 2,3లోనూ సమంత రోల్

Samantha Role : పుష్ప 2,3లోనూ సమంత రోల్

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. అందులో ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ పాట ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. స్టార్ హీరోయిన్ సమంతతో (Samantha) ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులోనూ సమంతనే ఐటెం సాంగ్ చేయనుందని మొదట్లో వార్తలు వెలువడ్డాయి. కానీ అవి నిజం కాదని తెలిసింది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఐటెం సాంగ్ చేయనుందని సమాచారం. ఈ మూవీలో సమంత క్యామియో రోల్ లో నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం పుష్ప -3 ఉంటుందని హీరో అల్లు అర్జున్ ప్రకటించాడు. అందులోనూ సమంత గెస్ట్ రోల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్న మేకర్స్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story