Shraddha Kapoor : ప్రపోజ్ చేస్తే పారిపోయాడు

Shraddha Kapoor : ప్రపోజ్ చేస్తే పారిపోయాడు

తీన్ పత్తీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. శ్రద్ధాకపూర్.. ఆషికీ 2 సినిమాతో ఈ అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం ఏక్ విలన్, బాఘీ, భేడియా లాంటి హిట్ సినిమాల్లో నటించింది. తన అందం, నటనతో మెప్పించింది. గతేడాది తూ ఝూతీ మై మక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ బ్యూటీ. శ్రద్ధా నటించిన స్త్రీ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే శ్రద్ధా కపూర్ కు, నటుడు వరుణ్ దావన్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచే వీరిద్దరు స్నేహితులు. ఒకే స్కూల్లో చదువుకున్నారు కూడా. అప్పట్లో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారనే వార్తలు వచ్చాయి.

తరువాత వాటికి పుల్ స్టాప్ పడింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ దావన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రద్ధా. చిన్నప్పటి నుంచి వరుణ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అతన్ని బాగా ఇష్టపడే దాన్ని అని పేర్కొంది. ఓ రోజు నేరుగా తనకు ప్రపోజ్ చేశానని దీంతో వెంటనే అతడు పరుగందుకున్నాడని తెలిపింది. వరుణ్కు ఏం చెప్పాలో తెలియక నో చెప్పి పారిపోయాడని వివరించింది. అప్పుడు తన వయసు ఎనిమిదేండ్లే అని తన చిన్నానాటి జ్ఞాపకాలను శ్రద్ధా గుర్తు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story