Shruti Haasan : రజినీకాంత్ సినిమాలో శృతి హాసన్!

Shruti Haasan : రజినీకాంత్ సినిమాలో శృతి హాసన్!

హీరోయిన్ గా శృతి హాసన్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శృతి హాసన్ కి నటిగా ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్స్ తో నటించింది. వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి జోడీగా చేసింది. వీరసింహారెడ్డితో బాలయ్యతో జత కట్టింది. సలార్ మూవీలో ప్రభాస్ కి జోడీగా కనిపించింది. ఇప్పుడు శృతి చేతిలో సలార్ 2, చెన్నై స్టోరీ అనే ఆంగ్లో ఇండియన్ మూవీ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరో బిగ్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుందని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం లోకేష్ కనగరాజ్ శృతి హాసన్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. లోకేష్, శృతి హాసన్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. రీసెంట్ గా ఇద్దరు కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ లో నటించారు. శృతి హాసన్ ఈ సాంగ్ ని పాడింది. ఈ ఫ్రెండ్ షిప్ తోనే రజినీకాంత్ సినిమాలో శృతి హాసన్ కి లోకేష్ కనగరాజ్ ఓ రోల్ ఆఫర్ చేసాడంట. ఆమె కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story