Meeta Raghunath : సైలెంట్​ గా పెళ్లి చేసుకుని సర్​ప్రైజ్ ఇచ్చింది

Meeta Raghunath : సైలెంట్​ గా పెళ్లి చేసుకుని సర్​ప్రైజ్ ఇచ్చింది

‘గుడ్ నైట్’ సినిమా‌తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్ మీతా రఘునాథ్ (Meeta Raghunath) పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరగగా, తాజాగా ఏడడుగులు వేశారు. ఈ ఫొటోలను మీతా ఇన్‌స్టాలో పోస్టు చేశారు. అయితే భర్త పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చెన్నై భామ మీతా రఘునాథ్.. టీనేజ్ లవ్ స్టోరీ ‘ముదల్ నీ ముడివుం నీ’ అనే తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ మనసుని దోచుకున్నారు. ఆ తరువాత ‘గుడ్ నైట్’ వంటి ఫీల్ గుడ్ మూవీలో పక్కింటి అమ్మాయిలా నేచురల్ యాక్టింగ్ తో అబ్బాయిల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో.. ఇక్కడి అబ్బాయిలు కూడా మీతా పై మనసు పాడేసుకున్నారు.

మిలియన్ డాలర్ స్డూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై వచ్చిన ఈ మూవీలో కె.మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీ అందర్నీ మెప్పించింది. ఈ సినిమా సౌతిండియాలో మంచి రెస్పాన్స్​ను దక్కించుకుంది. ఈ చిత్రంలో మీతా రఘునాథ్ తన సహజ నటనతో ప్రేక్షకులను తన మాయలో పడేసింది.

Tags

Read MoreRead Less
Next Story