Sree leela : క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టిన శ్రీలీల

Sree leela : క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టిన శ్రీలీల

టాలీవుడ్ లో (Tollywood) ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరంటే శ్రీలీల (Sree Leela) అనే చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ గా మారిపోయిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. అనంతరం బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

తన అందం, అభినయం, డాన్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్ గా విడుదలైన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఓ వైపు డాక్టర్ కోర్స్ చదువుతూనే మరోవైపు చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. దాంతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీలీల.. తన లెటెస్ట్ అప్ డేట్స్ ను నిత్యం ఫాన్స్ తో పంచుకుంటుంది.

ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా తనకు ఇష్టమైన డ్యాన్స్ ను శ్రీలీల వదలలేకపోతోంది. తాజాగా హైదరాబాద్లో సమతా కుంబ్ కార్యక్రమంలో గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

.

వీడియోను చూసిన వారంతా శ్రీలీల డాన్స్ కు ఫుల్ ఫిదా అవుతున్నారు. ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసిందంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ శ్రీలీల పాల్గొంటుంది.

Tags

Read MoreRead Less
Next Story