Laxmi Rai : బ్లాక్ బికినీ లో స్టైలిష్ అద్దాలతో రాయ్ లక్ష్మి

Laxmi Rai : బ్లాక్ బికినీ లో స్టైలిష్ అద్దాలతో రాయ్ లక్ష్మి

రెండు దశాబ్దాల క్రితం కాంచనమాల కెబుల్ టీవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ (Laxmi Rai). ఈ అమ్మడు లక్ కోసం తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. పేరు మార్చుకోవడంతో కొంతలో కొంత అయినా ఈ అమ్మడికి లక్ కలిసి వచ్చిందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. బడా హీరోల సినిమాల్లో నటించకున్నా. భారీ బ్లాక్ బస్టర్ విజయాలు వరుసగా పడకున్నా కూడా రెండు దశాబ్దాల సినీ కెరీర్ ను ఈ అమ్మడు కొనసాగిస్తూనే ఉంది.

ఈమె ఇన్నాళ్ల సినీ కెరీర్ కు కచ్చితంగా అందాల ఆరబోత అనడంలో సందేహం లేదు. ఇప్పటికే పలు సార్లు బికినీ ఫోటోలు షేర్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో హీట్ పెంచిన రాయ్ లక్ష్మి మరోసారి అంతే అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈ సారి అంతకు మించి అన్నట్లుగా బికినీ ట్రీట్ ఇచ్చింది. నెటిజన్స్ నోరు వెళ్ళబెట్టి మరీ చూసే విధంగా ఈ ఫోటోలు ఉన్నాయి.

బ్లాక్ బికినీ లో స్టైలిష్ అద్దాలతో రాయ్ లక్ష్మి అందాలు ఆరబోత చేసిన విధానంకు ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటున్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసిన ముద్దుగుమ్మ లక్ష్మి మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం ఖాయం అన్నట్లుగా నె టిజన్స్ మరియు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story