Surekha Vani : అమెరికా వెళ్లింది అందుకే.. సురేఖ వాణి సంచలనం

Surekha Vani : అమెరికా వెళ్లింది అందుకే.. సురేఖ వాణి సంచలనం

తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాక్ట్రెస్ సురేఖ వాణి (Surekha Vani) ఒకరు. వయసు మీదపడుతున్నా ఫిగర్ కాపాడుకుంటూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ. గతంలో ఏడాదికి కనీసం 5 నుంచి 6 సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ స్లిమ్ అండ్ బ్యూటీపుల్ యాక్ట్రెస్.

అక్కగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో క్యారెక్టర్ లో స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించి మెప్పించింది సురేఖ వాణి. భర్తకు దూరమై కూతురును ప్రమోట్ చేస్తూ గడుపుతున్న సురేఖ వాణి లైఫ్ స్టైల్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్. సురేఖ వాణి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాల్లేకపోయినా ఆమె ఖరీదైన కారు కొనుక్కుని విలాసవంతంగా జీవితం గడపడంపై ఎన్నో విమర్శలు వైరల్ గా మారాయి. దానిపై సురేఖవాణి తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది.

కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు వినిపించడంపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది. కేపీ చౌదరి డ్రగ్స్ కేజ్ గురించి మాట్లాడుతూ.. "అతను అందరి కామన్ గా ఉన్న ఒక ఫ్రెండ్ .. మేం పార్టీలో అందరితో కలిసే వాళ్ళం.. ఆయన ఫోన్లో నా ఫోటోలు కంటే వేరే ఆర్టిస్టుల ఫోటోలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దాదాపు 300 మంది ఆర్టిస్టుల ఫోటోలు ఉంటే ముగ్గురు ఫోటోలు మాత్రమే బయటకి తీశారు. అందులో నా ఫోటో కూడా బయటకి వచ్చింది. ఫోటోలు వేయడం వల్ల అందరూ నానారకాలుగా మాట్లాడారు. దాంతో నేను మానసిక ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో నాకు ఎవరి సపోర్ట్ లేరు. నా కూతురుతో కలిసి కూర్చొని ఏడ్చేదాన్ని. ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలనుకున్నా.. కానీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాన్న ఉద్దేశంతో మనశాంతి కోసం అమెరికాకు వెళ్ళిపోయా" అని తెలిపింది. ఆ ట్రిప్ వల్లే తాను డ్రగ్స్ ఇష్యూ నుంచి బయటపడ్డానంటూ సురేఖవాణి చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story