Tapsee : తాప్సీ మథియాస్ తో నీ పెళ్లెప్పుడు?

Tapsee : తాప్సీ మథియాస్ తో నీ  పెళ్లెప్పుడు?

బాలీవుడ్ నటి తాప్సీ పన్ను (Tapsee Pannu) విదేశీ క్రీడాకారుడు మథియాస్ బోతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అతడితో ప్రేమలో ఉన్నానని ప్రకటించి ఇప్పటికే చాలా కాలమే అయింది. ఇటీవల వీలున్న ప్రతిసారీ మీడియాకు తమ ప్రేమాయణం గురించి చెబుతూనే ఉందీ ముద్దుగుమ్మ. ప్రతిసారీ మాథ్యూస్ తో పెళ్లెప్పుడు? అనే ప్రశ్న ఎదురవుతోంది. దీనిపై తాప్సీ సమాచారం ఇవ్వడం లేదు. ఇటీవల మథియాస్ బోతో తన సంబంధంపై, గత డేటింగ్ అనుభవాలను ప్రస్తావించింది.

తన యువరాజును చేరుకునేందుకు తాను అనేక కష్టాలు పడాల్సి వచ్చిందంటోంది తాప్సీ. మాథియాస్ బో పరిణతి చెందిన వ్యక్తి. మాథియాస్ తో రిలేషన్ షిప్ స్టార్టయినప్పటి నుంచి మీలో ఏవైనా మార్పులొచ్చాయా..? అని ప్రశ్నిస్తే.. తనకు భారంగా అనిపించకపోవడం వల్ల ఎలాంటి ముఖ్యమైన మార్పులకు గురికాలేదని చెప్పింది.

పెళ్లి గురించి పుకార్లను ప్రస్తావిస్తూ సరైన సమయం వచ్చినప్పుడు అలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి అభిమానుల ఊహాగానాలను కొట్టిపారేసింది. 'నేను ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. నేను పెళ్లి చేసుకున్నప్పుడు అందరికీ తెలుస్తుంది.'అని చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story