Rajamouli : రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్స్ వీళ్లేనంట.. ఇంట్రస్టింగ్ సంగతులు

Rajamouli : రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్స్ వీళ్లేనంట.. ఇంట్రస్టింగ్ సంగతులు

రాజమౌళి ప్రస్థానం చరిత్రాత్మకం. ఆయన కెరీర్ ను నిర్మించుకున్న విధానం చాలామందికి స్ఫూర్తి. తన తెలివితేటలతో తన స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లగలిగారు ఈ దిగ్గజ దర్శకుడు. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు జక్కన్న. ఈ సినిమా కోసం ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నట్టు లేటెస్ట్ టాక్.

రాజమౌళి స్థాయిలో మెరిసే దర్శకులు ఎవరు.. ఆయన్ను దాటేసే దర్శకులు ఎవరనేది ఎప్పుడైనా సినిమా ప్రేక్షకుల మధ్య ఓ చక్కటి చర్చనీయాంశమే. రాజమౌళిని బీట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకులు ఇండియాలోనే లేరు అంటుంటారు మెజారిటీ అభిమానులు. సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్‌, సుకుమార్ లాంటి వాళ్ల అవుతుండొచ్చు అనేది కొందరి మాట.

ఐతే.. యాక్షన్ సీన్స్ కు తన మేధస్సును జతచేసి వెండితర అద్భుతాలు సృష్టించడంలో దిట్ట రాజమౌళి. ఏదేమైనా.. మహేశ్-రాజమౌళి సినిమా ప్రపంచ స్థాయి సినిమా కావాలని..ఆస్కార్ కోటల్ని బద్దలు కొట్టాలని ప్రతి తెలుగు, భారతీయ సినీ ప్రేమికుడూ కోరుకుంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story