Sobhita Dhulipala : టాలీవుడ్ బ్యూటీకి హాలీవుడ్ ఫిదా

Sobhita Dhulipala : టాలీవుడ్ బ్యూటీకి హాలీవుడ్ ఫిదా

స్లమ్ డాగ్ మిలీనియర్ యాక్టర్ దేవ్ పటేల్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ మంకీ మ్యాన్ (M0onkey Man). ఇందులో టాలీవుడ్ బ్యూటీ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అమెరికాలో శుక్రవారం రిలీజ్ అవ్వగా.. ఏప్రిల్ 26న ఇండియాలో విడుదల కానుంది. కాగా మంకీ మ్యాన్ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శోభిత గురించి దేవ్ పటేల్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

మంకీ మ్యాన్ సినిమాలో ఆమె ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేసిందని వ్యాఖ్యానించాడు. ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదని.. గొప్ప నటి అని సంబోధించాడు. ఇలాంటి సంపూర్ణమైన నటిని తాను చూడలేదని పేర్కొన్నారు. శోభిత కూడా మంకీ మ్యాన్ సినిమాలో నటించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందులో తన వారి కోసం పోరాడే అద్భుతమైన పాత్రలో ఈ బ్యూటీ నటించింది.

పాత్ర నచ్చితే చాలు అది ఎలాంటి సినిమా అయినా చేస్తానని చెప్పుకొచ్చింది శోభిత. మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తున్న శోభితాకు.. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని మంచి అవకాశాలు రావడం కన్ఫార్మ్ అని ఇండస్ట్రీలో టాక్. శోభిత చేసే క్రేజీ అటెంప్టులు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. తన ఫోటో షూట్స్ తోనే ఇంటర్నెట్ ని షేక్ చేసే అమ్మడు..డిఫరెంట్ సినిమాలతో అలరిస్తూ వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story