Trivikram : రణబీర్ రామాయణం తెలుగు వెర్షన్‌కు త్రివిక్రమ్ డైలాగులు..?

Trivikram : రణబీర్ రామాయణం తెలుగు వెర్షన్‌కు త్రివిక్రమ్ డైలాగులు..?

స్టార్ హీరోలతో సినిమాలు చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ధనుష్ తో కొత్త మూవీ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. త్రివిక్రమ్ ట్యాలెంట్ మరోసారి లిమిటెడ్ గా వాడుకునేందుకు ఓ మూవీ టీమ్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

ఈ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు రైటర్ గా ఎన్నో సినిమాలు హిట్ అవ్వడంలో కీలక పాత్ర వహించిన త్రివిక్రమ్.. ఇక మరోసారి దర్శకత్వ బాధ్యతలను పక్కనపెట్టి రైటర్ గా పని చేయబోతున్నాడట. ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకి. రణబీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో రామాయణం మూవీ తెరకెక్కుతుంది అన్నది బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఈ మూవీలో రావణుడికి పాత్రలో యష్ నటించబోతున్నాడట. అయితే ఈ సినిమా గురించి ఏదో ఒక న్యూస్ తెరమీదకి వస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా తెలుగు వర్షన్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా పని చేయబోతున్నాడు అని సమాచారం. సాధారణంగానే త్రివిక్రమ్ డైలాగులు రాస్తే అదిరిపోతూ ఉంటాయి. అలాంటిది రామాయణం లాంటి ఇతిహాసానికి త్రివిక్రమ్ డైలాగులు రాశాడంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story