Samantha : సమంతపై మళ్లీ ట్రోలింగ్.. ఆ పేరు ఎందుకు చెప్పింది?

Samantha : సమంతపై మళ్లీ ట్రోలింగ్.. ఆ పేరు ఎందుకు చెప్పింది?

సినిమాలు చేస్తున్నా చేయకపోయినా.. సమంత పేరు మాత్రం మార్మోగుతూనే ఉంటుంది. ఆమె ఇంపాక్ట్ అలాంటిది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, హాలీవుడ్ వెంచర్లతో సమంత తనదైన రూట్లో దూసుకుపోతోంది. బ్రేకప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో వన్ వుమెన్ షో చేస్తోంది.

యాడ్ ఫిలింలు, వెబ్ సిరీస్ లతో ఫుల్లుగా సంపాదిస్తోంది సమంత. సోషల్ మీడియాలో పెట్టే వర్కవుట్ వీడియోలు, లేటెస్ట్ ఫొటోషూట్లతో గూటికి వస్తున్న పక్షుల్లా ఫాలోవర్లు వెల్లువలా వచ్చి ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ ఫాలోయింగ్ తో కోట్ల రూపాయలు సంపాదిస్తోంది సమంత.

సమంత బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో యాడ్ లో స్క్రీన్ షేర్ చేసుకుంది. జొమాటో అడ్వర్టైజ్ మెంట్లో రణ్ వీర్, సమంత కలిసి చేశారు. ఈ యాడ్ ఫిలింలో రామ్ చరణ్, రణ్ వీర్ లలో ఒకరిని తీసుకుందామనుకున్నప్పుడు సమంత రణ్ వీర్ పేరు చెప్పిందట. దీంతో.. సమంతను ఓ వర్గం ట్రోల్ చేస్తోంది. దీనిపై సమంత క్లారిటీ ఇస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story