Devara : 'దేవర 'నుంచి వీడియో క్లిప్ లీక్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే

Devara : దేవర నుంచి వీడియో క్లిప్ లీక్.. బ్యాక్ గ్రౌండ్ ఇదే

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ (NTR) దేవర మూవీ ప్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. పలు కారణాలతో సినిమా వాయిదాపడుతోంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ అనౌన్స్ చేశారు.

సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దేవర లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ఒక సాంగ్ కూడా రూపొందించనున్నారట. గోవా సాగర్ తీరంలో ఎన్టీఆర్ మీద ఓ సన్నివేశం తెరకెక్కిస్తుండగా.. వీడియో లీక్ అయింది.

ఎన్టీఆర్‌-జాన్వి కపూర్ లపై డ్యూయెట్‌ను ప్లాన్ చేశారట. నల్ల దుస్తుల్లో ఉన్న ఎన్టీఆర్ సముద్రంలో నుండి బయటకు తనదైన స్టైల్ లో నడిచి వస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ కు అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. కొరటాల శివ ... ఎన్టీఆర్ ను డిఫరెంట్ రెండు రోల్స్ లో చూపిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story