Family Star OTT : ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్... ఎప్పుడంటే?

Family Star OTT : ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్... ఎప్పుడంటే?

విజయ దేవరకొండ హీరోగా పరశురాం కాంబోలో వచ్చిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతగోవిందం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఈ నెల 5న భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది.

ఇక థియేటర్స్ లో యావరేజ్ నిలిచిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్న తరుణంలో ఓ అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ను రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంటు న్నాడు. మొన్నామధ్య వచ్చిన ఖుషి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినా.. కలెక్షన్స్ ఓ మాదిరిగా రాబట్టిం ది. కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా విజయ్ ఫ్యాన్సును నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తున్నా డు విజయ్.

Tags

Read MoreRead Less
Next Story