Upasana : వేణు స్వామి చెప్పిందే నిజమైంది.. సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉపాసన రెడీ

Upasana : వేణు స్వామి చెప్పిందే నిజమైంది.. సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉపాసన రెడీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి (Ram charan) ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డబుల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది మెగా కోడలు ఉపాసన. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులకి మంచి మంచి విషయాలు చెప్పే ఉపాసన .. రీసెంట్ గానే క్లింకారకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత పదకొండేళ్లకు వీళ్లకు పాప పుట్టడంతో మెగా ఫాన్స్ ఫుల్ సంబరాలు చేసుకున్నారు.

అయితే మరోసారి ఉపాసన తల్లి కాబోతుంది అనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఒక కార్యక్రమానికి వచ్చిన ఉపాసన స్పందించింది. తన రెండో ప్రెగ్నెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మొత్తంగా మహిళల ఇష్టమనీ.. తాను పిల్లలను ఆలస్యంగా కనాలనుకున్నాననీ.. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీకి కూడా రెడీ అయ్యానని చెప్పారామె.

తన నిర్ణయాలపై తానెప్పుడూ బాధపడలేదని ఉపాసన తెలిపింది. మహిళలు ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలనీ..తమను తాము పట్టించుకోవాలని సూచించారు ఉపాసన కొణిదెల.

గతంలో వేణు స్వామి సైతం త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడంటూ చెప్పాడు. ఇప్పుడు మెగా కోడలు కామెంట్స్ తో ఆ మాటలు నిజం అవుతాయంటున్నారు ఫ్యాన్స్.

Tags

Read MoreRead Less
Next Story