Janhvi Kapoor : ట్రిపుల్ ఆర్ హీరోలు జాన్వీకపూర్ కు కలిసి వస్తారా?

Janhvi Kapoor : ట్రిపుల్ ఆర్ హీరోలు జాన్వీకపూర్ కు కలిసి వస్తారా?

బాలీవుడ్ భామకు టాలీవుడ్ లో పరీక్షా సమయం మొదలైంది. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసిన జాన్వీకపూర్ (Janhvi kapoor) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్ననే ఆర్సీ16లో తెలుగులో రెండో సినిమాలో నటిస్తోంది. మొదటిగా దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రి బోణి కపూర్ బాలీవుడ్ బడా నిర్మాత కావడంతో జాన్వీ కపూర్ కి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో మొదటి అవకాశం వచ్చింది. సైరత్ రీమేక్ ధఢక్ తో ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టి సూపర్ హిట్ అందుకుంది.

సెకండ్ మూవీగా ఫీమేల్ ఒరియాంటెడ్ కథతో రియల్ లైఫ్ ఎయిర్ ఫైటర్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో జాన్వీ కపూర్ నటించింది. ఆ మూవీ పర్వాలేదనే టాక్ తెచ్చు కుంది. తరువాత ఈ బ్యూటీ చేసిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అవన్నీ కూడా బోనీ కపూర్ నిర్మిం చినవే కావడం విశేషం. కూతురు కెరీర్ కోసం బోణి కపూర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. రామ్ చరణ్ కి జోడీగా RC16లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఈ సినిమా షూటింగ్ కూడా నిన్ననే మొదలైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ సిద్ధం అవుతోంది.

పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ తెరకెక్క నున్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిన జాన్వీ కపూర్ కి ఆశించిన గుర్తింపు రాలేదు. టాలీవుడ్ లో ఆమె అసలైన కెరీర్ ఇప్పుడే మొదలైందని చెప్పాలి. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే అవకాశం అందుకుంది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే జాన్వీ కపూర్ డైరెక్ట్ గా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోతుంది. ఈ అమ్మడికి మన ట్రిపుల్ ఆర్ హీరోలు ఎలాంటి సక్సెస్ లను అందిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story