ACB : రూ.84 వేలు లంచం.. ఏసీబీకి చిక్కి ఏడ్చేసింది

ACB : రూ.84 వేలు లంచం..  ఏసీబీకి చిక్కి ఏడ్చేసింది

ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Jaga Jyothi) రూ.84 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకున్న వెంటనే ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో ఒక్క సారిగా షాక్ కు గురైన జగజ్యోతి వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. ఏసీబీ అధికారుల కథనం మేరకు మాసట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో జగ జ్యోతి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విధులు నిర్వహిస్తోంది.

ఈక్రమంలో నిజామబాద్ కు చెందిన కాంట్రాక్టర్ బోడుకం గంగన్న గాజుల రామారంలో జూవెనల్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన బిల్లు మొత్తాల విషయంలో జగజ్యోతిని సంప్రదించాడు. నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు మొత్తాలు చెల్లించేందుకు రూ. 1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నిర్మాణంలో లాభాలు రాలేదని, అంత మొత్తాలు ఇవ్వలేనని బేరమాడటంతో రూ.లక్ష ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని ఏఈ తేల్చిచెప్పింది. ఈక్రమంలో తొలివిడతగా రూ.84 వేలు ఇచ్చేలా ఇద్దరి మధ్య ఒప్పదం కుదిరింది.

ట్రైబల్ వెల్పేర్ కార్యాలయంలో ఇచ్చే ముందు, కాంట్రాక్టర్ గంగన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుండి జగజ్యోతి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఏఈ జగజ్యోతి చేతి వేళ్లకు కెమికల్ పరీక్షలు నిర్వహించి రూ.84వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం కేసులో పట్టుబడిన నిందితురాలిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

Tags

Read MoreRead Less
Next Story