రోడ్డు ప్రమాదంలో అస్సాం 'లేడీ సింగం' దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో అస్సాం లేడీ సింగం దుర్మరణం
అస్సాంకు చెందిన 'లేడీ సింగం' జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

అస్సాంకు చెందిన 'లేడీ సింగం' జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదంపై సీబీఐ విచారణ జరుపుతోంది. జున్మోని రభా (30), సంఘటన జరిగిన సమయంలో తన ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్నారు.

అస్సాంలోని నాగావ్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఆమె వాహనం ఒక కంపార్ట్‌మెంట్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె మరణాన్ని 'మిస్టరీ'గా అభివర్ణించారు. ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేశారు.

తెల్లవారుజామున 2:30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ అక్కడి నుండి తప్పించుకున్నాడు.

సమాచారం అందుకున్న నాగావ్ పోలీసు సూపరింటెండెంట్ లీనా డోలీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఎస్‌ఐ తన రహస్య వాహనంలో ఎగువ అస్సాం వైపు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సివిల్ దుస్తులతో ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారనే దానిపై వారికి ఎలాంటి క్లూ లేదు. ఆమె కుటుంబం కూడా ఇది యాక్సిడెంట్ కాదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం వెనుక ఉన్న వాస్తవాన్ని గుర్తించడానికి న్యాయమైన విచారణ జరగాలని అభ్యర్థించారు.

మీడియాను ఉద్దేశించి మృతుడి తల్లి సుమిత్రా రభా మాట్లాడుతూ, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని పేర్కొన్నారు. దోషులను శిక్షించడం ద్వారా కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను కోరారు.

సోమవారం రాత్రి, నాగోన్‌లోని జున్మోని అధికారిక క్వార్టర్‌పై పోలీసు ఉన్నతాధికారుల బృందం దాడి చేసి సుమారు రూ. 1 లక్షను స్వాధీనం చేసుకుంది. దాడి సమయంలో ఆమె తల్లి కూడా ఉన్నారు."

Tags

Read MoreRead Less
Next Story