క్రైమ్

Sri Sathyasai District: ప్రేమిస్తున్నాని నమ్మించి స్నేహితులతో కలిసి గ్యాాంగ్ రేప్..? ఆపై హత్య..?

Sri Sathyasai District: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించినవాడే మోసం చేశాడు.

Sri Sathyasai District: ప్రేమిస్తున్నాని నమ్మించి స్నేహితులతో కలిసి గ్యాాంగ్ రేప్..? ఆపై హత్య..?
X

Sri Sathyasai District: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించినవాడే మోసం చేశాడు. ప్రేమించానని నమ్మించి.. స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌ చేశాడు. తర్వాత హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు. గోరంట్ల చెందిన తేజస్విని తిరుపతిలో ఫార్మసీ చదువుతోంది. మల్లాపల్లికి చెందిన సాధిక్‌కి, ఆమెకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సాధిక్‌ రెండ్రోజుల క్రితం ఆమెను కారులో మల్లాపల్లికి తీసుకొచ్చాడు.

తన గదిలో బంధించి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ రేప్‌ చేసి హత్యచేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు చెప్పాడు సాధిక్‌. దీంతో.. ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు..డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తేజస్విని మృతిపై అనుమానం వ్యక్తం చేశారు కుటుంబసభ్యులు. తేజస్వినిది ఆత్మహత్యేనన్న అర్థం వచ్చేలా డీఎస్పీ మాట్లాడటంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలంటూ మృతదేహంతో అర్ధరాత్రి వరకు గోరంట్ల పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించారు. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఉదయమే నిందితుడు లొంగిపోయినా ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. రీ పోస్టుమార్టం జరిపించాలని డిమాండ్‌ చేశారు. గతంలోనూ సాదిక్‌...మల్లాపలిలో ఓ ఎస్సీ మహిళను నమ్మించి ప్రేమ పేరుతో వంచించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడంటున్నారు బంధువులు. తేజస్విని కేసులో పోలీసుల తీరుపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మాజీ ఎంపీ నిమ్మలకిష్టప్ప అక్కడకు చేరుకుని బాధితుల తరఫున పోలీసులతో మాట్లాడారు.

విద్యార్థిని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, 50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలన్నారు. దీంతో.. రీపోస్ట్‌మార్టం చేయించి, నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డీఎస్పీ నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సవిత. పోలీసులు నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES