క్రైమ్

Karimnagar : కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Karimnagar : దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Karimnagar : కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
X

Karimnagar : కరీంనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో డ్రైవింగ్‌ చేయడంతో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మానకొండూరు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

మృతులు జలందర్‌, శ్రీనివాసరావు, రాజు, కొప్పుల బాలాజీగా గుర్తించారు. క్షతగాత్రుడు సుధాకర్‌ చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసరావు సిరిసిల్ల పంచాయతీ ఈఈగా పనిచేస్తున్నారని.. బాలాజీ అనే వ్యక్తి పెద్దపల్లిలో అడ్వకేట్‌గా ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ సొంత అన్నదమ్ములేనని వెల్లడించారు.

Next Story

RELATED STORIES