తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం .. జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కర్ణాల వీధిలో జనంపైకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతిచెందింది. మరొకరికి తీవ్రగాయమైంది.

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం .. జనంపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
X

తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. కర్ణాల వీధిలో జనంపైకి దూసుకెళ్లడంతో ఓ మహిళ మృతిచెందింది. మరొకరికి తీవ్రగాయమైంది. తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలిపిరికి బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. కర్ణాల వీధిలో అదుపుతప్పి ఒక్కసారిగా జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES