Shanmukh Jaswant : షణ్ముఖ్, సంపత్ పై సంచలన అభియోగాలు.. అరెస్ట్ సినిమాటిక్ లవ్ క్రైమ్ స్టోరీ ఇదే..!

Shanmukh Jaswant : షణ్ముఖ్, సంపత్ పై సంచలన అభియోగాలు.. అరెస్ట్ సినిమాటిక్ లవ్ క్రైమ్ స్టోరీ ఇదే..!

బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswant) అరెస్ట్ అయ్యాడు. పోలీసులు షణ్ముఖ్ తో పాటు ఆయన అన్నయ్య సంపత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు విషయమై షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. షణ్ముఖ్ అన్నయ్య సంపత్… డాక్టర్ మౌనికను ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను కాదని వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడు, చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

సంపత్ కోసం హైదరాబాద్ పోలీసులు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. అనూహ్యంగా ఇంట్లో అన్నదమ్ములు గంజాయి సేవిస్తూ కనిపించారు. షణ్ముఖ్ ఇంట్లో గంజాయిని పోలీసులు కనుగొన్నారు. ఒక కేసు కోసం వెళితే వాళ్లకు మరో కేసు దొరికింది. గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీస్తుంటే అడ్డుకున్నాడని సమాచారం. షణ్ముఖ్, సంపత్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ గా ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ అరెస్ట్ కలకలం రేపుతోంది.

గతంలో కూడా షణ్ముఖ్ అరెస్ట్ అయ్యాడు. హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అతివేగంగా కారు నడిపి వాహనాలు ధ్వంసం చేశాడు. అలాగే కొందరికి గాయాలు అయ్యాయి. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో షణ్ముఖ్ మోతాదుకు మించి తాగలేదని తేలింది. దాంతో తక్కువ శిక్షతో బయటపడ్డాడు. తాజాగా ఏకంగా డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. దీప్తి, సిరిలతో లవ్ స్టోరీలతోనూ షణ్ముఖ్ గతంలో వార్తల్లోకి వచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story