Dasara Navaratri 2021: దసరా నవరాత్రులు 6వ రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో.. ఈ మంత్రం పఠిస్తే..

Dasara Navaratri 2021: దసరా నవరాత్రులు 6వ రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో.. ఈ మంత్రం పఠిస్తే..
Dasara Navaratri 2021: నవరాత్రుల వేళ ఆరో రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

Dasara Navaratri 2021: హిందూ సంప్రదాయం ప్రకారం, నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. చెడుపై మంచి విజయం సాధిస్తుంది అనడానికి నిదర్శనంగా దసర పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం దుర్గాదేవి రాక్షసుడిని సంహరించిన రోజు అని, మరోవైపు రాముడు రావణాసురుడిని అంతమొందించిన రోజును వేడుక చేసుకునే పండుగ దసరా. ఇదిలా ఉండగా ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు.

హిందూ సంప్రదాయం ప్రకారం, నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు తిమ్మిది రూపాల్లో అమ్మవారిని వివిధ అవతరాల్లో కొలుస్తారు. చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా దసరా పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.

పురాణాల ప్రకారం, దుర్గాదేవి రాక్షసుడిని సంహరించిన రోజు అని.. మరోవైపు రాముడు రావణసురుడిని మట్టుబెట్టిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా నవరాత్రుల వేళ ఆరో రోజు సరస్వతీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.

సూర్యోదయానికి ముందే స్నానపానాదులు ముగించి సరస్వతీ దేవికి పూజ చేయాలి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లని పువ్వులతో అమ్మని పూజించాలి. అలాగే దేవి ముందు పుస్తకాలు, పెన్ను ఉంచాలి.

ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపారాధన చేయాలి. అలాగే అమ్మవారికి క్షీరాన్నం, పాలతో బెల్లం నెయ్యి వంటి పదార్ధాలు కలిపి చేసిన వాటిని నివేదించాలి. అలాగే చలివిడి, వడపప్పు, పానకం వంటి ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి. ఇక నానబెట్టిన మొలకలు వచ్చిన పెసర్లు, శనగలు వంటి వాటిని సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.

సరస్వతీ దేవికి పూజా సమయంలో పఠించవలసిన మంత్రాలు..

శ్రీ సరస్వతీ కవచం

ఓం శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరోమేపాతుసరస్వత:,

ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతిశ్రోత్రేపాతు నిరస్తరమ్,

ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు,

ఐం హ్రీ వాగ్వాదిన్యై స్వాహా నాసాంమే సర్వదా వతు,

ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా ఓష్టం సదా వతు,

ఐం ఇత్యేకాక్షరో మంత్రోమమ కంఠం సదావతు,

ఓం శ్రీం హ్రీం పాతుమే గ్రీవాం స్కంధౌమే శ్రీం సధా వతు,

ఓం హ్రీం విద్యాధిషాంతృదేవ్యై స్వాహా వక్ష: సదా వతు,

ఓం హ్రీం హేతి మమహస్తా సదావతు

అలాగే నవరాత్రి వేళ అమ్మవారికి అష్టోతర నామాలు, సహస్ర నామాలు పఠించాలి.

Tags

Read MoreRead Less
Next Story