Aadhar Card : ఆధార్ కార్డ్‌తో మోసపోకండి.. కీలక ఆదేశాలు జారీ

Aadhar Card : ఆధార్ కార్డ్‌తో మోసపోకండి.. కీలక ఆదేశాలు జారీ

ఆధార్ కార్డ్ (Aadhar Card) అందరికీ ఎంతో ముఖ్యమైనది. దీనిపై ఎన్నో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలామందిలో వీటిపై డౌట్స్ ఉన్నాయి. అందుకే యూఐడీఏఐ (యునీక్​ ఐడెన్టిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియా) అలర్ట్ అయింది. పలు ఎఫ్​ఏక్యూలను, వాటికి సమాధానాలను విడుదల చేసింది.

ఆధార్​ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ ఇచ్చిన ప్రశ్నలు, సమాధానాలు ఇవే.

1. బ్యాంక్​ అకౌంట్​, పాన్​తో పాటు ఇతర సేవలకు ఆధార్​ని లింక్​ చేస్తే.. నేను మోసానికి గురయ్యే అవకాశం పెరుగుతుందా?

సమాధానం:- అలా ఏం లేదు. అకౌంట్​​ వివరాలను మీ బ్యాంక్​ ఎవరికి చెప్పదు. ఆధార్​ నెంబర్​తో మీ బ్యాంక్​ అకౌంట్​ వివరాలు తెలుసుకోవడం అసాధ్యం. అంతేకాదు.. యూఐడీఏఐతో పాటు ఏ ఇతర సంస్థ వద్ద కూడా మీ బ్యాంక్​ అకౌంట్​ వివరాలు ఉండవు. ఉదాహరణకు.. దాదాపు ప్రతి చోట మీ ఫోన్​ నెంబర్​ ఇస్తారు. మరి.. మీ టెలికాం సంస్థ దగ్గర మీ బ్యాంక్​ వివరాలు ఉండవు కదా! ఇదీ అంతే!

2. నా ఆధార్​ కార్డు ఉన్నా, ఆధార్​ నెంబర్​ ఉన్నా.. లింక్​ అయ్యి ఉన్న బ్యాంక్​ అకౌంట్​ వివరాలను ఇతరులు తెలుసుకనే అవకాశం ఉందా? ఎవరైనా ఆధార్​ కార్డు ఉన్న వారు.. మోసానికి గురయ్యారా?

సమాధానం:- బ్యాంక్​ అకౌంట్​ నెంబర్​ తెలిసినంత మాత్రానా.. అందులో నుంచి డబ్బులు డ్రా చేయలేరు కదా! అదే విధంగా.. ఆధార్​ కార్డు నెంబర్​ తెలిసినంత మాత్రాన.. అది లింక్​ అయ్యి ఉన్న బ్యాంక్​ అకౌంట్​ నుంచి ఎవరు డబ్బులు విత్​డ్రా చేయలేరు. పిన్​, ఓటీపీలు.. చాలా వ్యవహారాలు ఉంటాయి. ఆధార్​ నెంబర్​తో ఇప్పటివరకు ఎవరు మోసానికి గురవ్వలేదు.

3. మోసగాళ్లకు నా ఆధార్​ నెంబర్​ తెలిసి, దానితో నాకు తెలియకుండానే ఓ బ్యాంక్​ అకౌంట్​ ఓపెన్​ చేద్దామని చూస్తే ఏం జరుగుతంది? నాకు నష్టం జరుగుతుందా?

సమాధానం:- పీఎంఎల్​ రూల్స్​ ప్రకారం.. బ్యాంక్​ అకౌంట్​ ఓపెన్​ చేయాలంటే.. ఆధార్​ నెంబర్​ కచ్చితంగా ఉండాలి. అదే సమయంలో.. బ్యాంక్​లు కేవైసీని పూర్తి చేయాలి. ఎవరైనా మోసగాళ్లు.. మీ ఆధార్​ నెంబర్​తో బ్యాంక్​ అకౌంట్​ ఓపెన్​ చేసి, బ్యాంక్​లు కేవైసీని పూర్తి చేయకపోతే, అది మీ తప్పు అవ్వదు. బ్యాంక్​ తప్పు అవుతుంది. అయితే.. ఇప్పటివరకు ఎవరికి ఆర్థిక నష్టం జరగలేదు.

4. ఐడెంటిటీ వెరిఫికేషన్​ కోసం.. నా ఆధార్​ కార్డుని సర్వీస్​ ప్రొవైడర్​కి ఇచ్చాను. ఆధార్​ నెంబర్​ తెలిస్తే ఎవరైనా నాకు హానీ చేసే అవకాశం ఉందా?

సమాధానం:- లేదు. మీ ఆధార్​ కార్డు నెంబర్​ తెలిసినంత మాత్రాన.. ఎవరు మిమ్మల్ని హాని చేయలేరు. పాస్​పోర్ట్​, ఓటర్​ ఐడీ, పాన్​ కార్డు, రేషన్​ కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్​ లాగనే.. ఆధార్​ కార్డు కూడా పనిచేస్తుంది.

5. ఆధార్​ కోసం నేను అప్లై చేసుకున్నాను. కానీ రాలేదు. మళ్లీ అప్లై చేసుకున్నాను. మరి ఎప్పుడు వస్తుంది?

సమాధానం:- ఫస్ట్​ ఎన్​రోల్​మెంట్​తో మీ ఆధార్​ జెనరేట్​ అయ్యి ఉంటే.. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎన్​రోలింగ్​కి ప్రయత్నించినా రిజెక్ట్​ అవుతుంది. మళ్లీ, మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.

Tags

Read MoreRead Less
Next Story